chandrababu naidu విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన చంద్ర బాబునాయుడు
విధ్వంసం.. కూల్చివేతలతో మొదలైన వైసీపీ పాలన త్వరలో కూలిపోతుందని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులేనని ప్రజాస్వామ్య విలువలు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేసిందని అన్నారు.వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న నా మాటలకు హేతువు ఏమిటో ‘విధ్వంసం’ పుస్తకం చూపుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.వనరులను కొల్లగొట్టిన జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడటం వింతగా ఉందని క్లాస్ వార్ గురించి ఈ ముఖ్యమంత్రికి భవిష్యత్తులో బలమైన పాఠం చెబుతామని 33 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారని సీఎం ఒప్పుకొన్నందుకు సంతోషం అని
విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిచిన శ్రీ చంద్రబాబు నాయుడు తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ కి అందజేతారు.వైసీపీ ప్రభుత్వ పాలన విధ్వంసంతో కూల్చివేతలతో మొదలయ్యిందని ప్రజాస్వామ్య విలువలు తాకట్టుపెట్టిందని కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కూలిపోతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. త్వరలోనే వైసీపీ పాలన కూలిపోతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గనుల్లో వేల కోట్లు దోచేసి ఇసుక అడ్డగోలుగా దోచేస్తున్న ఈ పాలకులు క్లాస్ వార్ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఈ పాలకులకు భవిష్యత్తులో క్లాస్ వార్ అంటే ఏమిటో బలమైన పాఠం నేర్పుతామని స్పష్టం చేశారు. ఈ పాలకులు అమరావతి ప్రజలను ఏ విధంగా హింసించారో. విధ్వంసానికి గురి చేసి రాష్ట్ర ప్రజల జీవితాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో.. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా కాలరాస్తాం.. గుర్తు పెట్టుకోవాలాని హెచ్చరించారు. గురువారం రాత్రి విజయవాడలో ప్రముఖ పాత్రికేయులు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ పూసకాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వైసీపీ వ్యతిరేక ఓటు ఎందుకు చీలనివ్వనన్నానో దానికి విధ్వంసం పుస్తకం చెబుతుంది. ప్రతిపక్షాలు ఎందుకు కలసి రావాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదు? విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పార్టీలన్ని ప్రజల పక్షాన ఎందుకు నిలవాలి? అన్న అంశాలకు రచయిత ఆలపాటి సురేష్ కుమార్ ఊతమిచ్చారని అన్నారు.. ఈ పుస్తకాన్ని పాత్రికేయ విలువలతో రచించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రచయిత ఎవరి పక్షం తీసుకోలేదు. ప్రజల పక్షాన నిలిచి ఈ పుస్తకం రాశారని జరిగిన సంఘటన జరిగినట్టు ఒక సాక్షీభూతంగా నిజమైన జర్నలిస్టు విలువలు పాటిస్తూ రిపోర్టు చేసినట్టు రాశారని కొనియాడారు.విధ్వంసంలో ఎక్కడా పక్షపాత ధోరణి లేదు. పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను సాక్షీ భూతంగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు.
ఎన్నికలు అయిన వెంటనే ఈ ప్రభుత్వ పాలన కూల్చివేతలతో మొదలయ్యింది. అమరావతి రైతుల మీద దాడి జరిగినప్పుడు వారి మీద పడ్డ దెబ్బలు చూసి గుండె చెదిరిపోయింది. ఆడపడుచుల మీద అఘాయిత్యాలు చాలా బాధ కలిగించాయి. ఎన్నికలు దగ్గర పడి ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం. 2019 నుంచి సుధీర్ఘమైన కాలం వీరి దాష్టికాన్ని తట్టుకోగలమా అని అప్పట్లో అనిపించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరు అనుభవించిన బాధను ఈ పుస్తకంలో ఉదహరించారు. పుస్తకం భారతదేశంలో పాలకులకి ఒక హెచ్చరిక. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదో తెలియచేస్తోంది. ప్రజా క్షేమాన్ని ఆకాంక్షించే జర్నలిస్టు రాస్తే ఎలా ఉంటుందో తెలియచేస్తోంది. ఈ పుస్తకాన్ని ఒక గీటు రాయిలా తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వ్యవస్థలో భాగస్వామ్యమవుతామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను.• ముఖ్యమంత్రి నా వ్యాఖ్యలు వక్రీకరించారు
ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక సభలో 33 వేల మంది మహిళలు వాలంటీర్ల వల్ల అదృశ్యమయ్యారని నేను చెప్పినట్టు చెబుతున్నారు. నేను చెప్పింది.. వాలంటీర్లు డేటా కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీకి వెళ్లి, ఆ కంపెనీ నుంచి ఏటో వెళ్లిపోయింది అని. వాలంటీర్ వ్యవస్థ చేశారని అనలేదు. వాలంటీర్ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. వైసీసీ పెద్దల ప్రోద్బలంతో వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజా సమాచారం వాలంటీర్లకే తెలియకుండా పక్కదారి పట్టడం వల్ల నేరాలు జరిగే ఆస్కారం ఉందని చెప్పాను. కొద్ది మంది వాలంటీర్లు చేసిన తప్పులకు వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు తీసుకువచ్చిందని మాత్రమే చెప్పాను. మీ భవిష్యత్తుకి మేము అండగా ఉంటాం. రాష్ట్రంలో 33 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని నేను చెబితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారని సాక్షాత్తూ పార్లమెంటులో కేంద్ర మంత్రులు అంకెలతో సహా నేను చెప్పిన లెక్కను చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఈ సందర్భంగా అయినా ఈ ప్రభుత్వ పాలనలో 33 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారన్న నిజం ముఖ్యమంత్రి ఒప్పుకున్నందుకు సంతోషం అని అన్నారు.
ఈ రోజుకీ ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తికి చంద్రబాబు నాయుడు ని, నన్ను తిట్టడం మినహా ఆయనకి వేరే పని లేదు. జర్నలిజం గురువు, సంపాదకులు ఆర్.వి.రామారావు క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రికి కచ్చితంగా పాఠం చెప్పాలి. ఇన్ని ఇసుక రీచ్ లు ఉంటే వాటిని ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడుతాడు అని అన్నారు. గనుల విభాగంలో వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు మైనింగ్ మాఫియాతో రాష్ట్ర సహజ సంపదను తన వారికి కొల్లగొట్టిన వ్యక్తి క్లాస్ వార్ అని చెబుతుంటే వినడానికి కూడా సిగ్గేస్తోందని జగన్ చేసిన ప్రతి తప్పుకు బలమైన గుణపాఠం చెబుతామని పవన్ అన్నారు. ప్రతి తప్పిదానికి లెక్క చెప్పాల్సిందేనని విధ్వంసం, విచ్ఛిన్నంతో రాష్ట్రాన్ని తిరుగోమన బాటకు కారణమైన జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు.
ఈ పుస్తకావిష్కరణ సభకు ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర సంపాదకులు శ్రీ ఆర్.వి.రామారావు అధ్యక్ష్యత వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ, అమరావతి పోరాట నాయకులు శ్రీ పోతుల బాలకోటయ్య, శ్రీ ఎ.శివారెడ్డి, సీనియర్ న్యాయవాది శ్రీ ముప్పాళ్ళ సుబ్బారావు పాల్గొన్నారు.