సీఎం రేవంత్ రెడ్డి కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగుతానని అన్నారు.తెలంగాణ లో పదేళ్ళపాటు ఇందిరమ్మ రాజ్యం అమలవుతుందని ధీమాగా చెప్పారు.అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు.పదేళ్లు అధికారంలో ఉంటా నీకు చేతనైంది చేసుకో అని సవాలు విసిరారు.
పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.కామారెడ్డి లో ప్రజలు బండకేసి కొట్టారని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పాథాలంలోకి నెట్టారని ఎద్దేవాచేశారు.శాసన సభకు రాని కేసీఆర్ నల్గొండ లో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారని అంటుండు కానీ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని ప్రజలు గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో నీళ్లు నియామకాల మీద చర్చకు రాని కేసీఆర్ నల్గొండ కు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడాని ఎద్దేవా చేశారు.వీల్ చైర్ లో తిరుగుతున్న కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కంటుండు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.సంపుతారా అని కేసీఆర్ అడుగుతున్నడు సచ్చిన పామును ఎవరైనా సంపుతారా అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ పని అయిపోయిందని బీఆర్ఎస్ ని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని అందుకే సానుభూతి కొరకు తాపత్రయపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన నీళ్లు,నిధులు తీసుకురాలేదని మేం అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోనే సమస్యలు పరిష్కరించుకుంటు వెళ్తున్నామని అయితే అప్పుడే ఎం చేయట్లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారని కానీ ప్రజల ఆశీర్వాదంతో ప్రజా పాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ పదేళ్లు నేనే సీఎం గా కొనసాగుతానని ఇందిరమ్మ రాజ్యం అమలుకు కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.