కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేరు చేతకాకపోతే ముఖ్యమంత్రి గా తనకు భాద్యతలు అప్పగించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు…
రాష్ట్ర రాజాకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా నడుస్తుండగా మరోవైపు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్గొండ సభతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడిన మాటలు తెలంగాణ అసెంబ్లీలో దుమారాన్ని రేపాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించి మెడిగడ్డ లోని కుంగిన పిల్లర్లను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, ప్రాజెక్ట్ కట్టడంలో నాణ్యత లోపాన్ని ప్రజలకు మీడియా సాక్షిగా వివరించే ప్రయత్నం చేశారు.అయితే ఇదే విషయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కోపాన్ని తెప్పించింది.నల్గొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తనదైన శైలిలో విమర్శలు చేసారు.ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
నల్గొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీలో వేడివేడి చర్చ జరిగింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సభలో మాట్లాడిన అసభ్యకరమైన పదాలు రికార్డ్ లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు.అసెంబ్లీ నుండి నేరుగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభలో జరిగిన విషయాలను ప్రజలకు వెల్లడించే ప్రయత్నం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తన సహచర మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు.రైతులకు అన్యాయం చేయవద్దని కుంగిన పిల్లర్లను రిపేరు చేయించి రైతులకు నీరు అందించాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డికి చేతకాకపోతే తనకు ముఖ్యమంత్రి గా అవకాశం ఇస్తే కాళేశ్వరం పునరుద్దరించి చూపిస్తానని మీడియా సమావేశంలో హరిష్ రావు వ్యాఖ్యలు చేశారు…