మాజీ డీజీపీ, ప్రస్తుత TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు.మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారని గుర్తు చేశారు.టీఎస్పీఎస్సి లో సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు అని కవిత ప్రశ్నించారు
రాజకీయాలకు సంబంధమున్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే అది విస్మరించి టీడీపీలో పనిచేసిన రజని కుమారిని కమిషన్ సభ్యురాలిగా ఎలా నియమించారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.