రాష్ట్రంలో ఒకేరోజు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ విడిచి జిల్లాల బాట పట్టారు.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు,ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లగా,ఇటు నేతలు నల్లగొండ బయలుదేరారు.నల్లగొండ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్సులో తరలివెళ్లారు.ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు,ఎమ్మెల్యేలు అసెంబ్లీ వాయిదా అనంతరం బయలు దేరారు.దింతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే రాజకీయాలు కాస్త జిల్లాలకు చేరాయి. మెడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది అయితే బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నాయి.ఇక సాయంత్రం నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్, ఇటు మెడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.కృష్ణా జలాల హక్కు కోసం బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుండగా మెడిగడ్డ లో జరిగిన అవినీతి పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరించనున్నది మొత్తానికి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఆసక్తి పరిణామాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.