నల్లకండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

brs mlcs

శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బాగంగా ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బిఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు.శాసన మండలిలో కౌన్సిల్ పోడియం దగ్గర బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమానపరిచారని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదని పోడియం చుట్టిముట్టి అందోళన చేయండంతో కౌన్సిల్ చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.అనంతరం సీఎం పై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీ కి పంపినట్లు సబ్యులకు కౌన్సిల్ చైర్మన్ తెలిపారు..

Share