బీఆర్ఎస్ పార్టీకి షాక్…రాజీనామా చేసిన మాజీ GHMC డిప్యూటీ మేయర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబా ఫసియుద్దీన్
Baba Fasiuddin బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబా ఫసియుద్దీన్
బీఆర్ఎస్ పార్టీకి మరో లీడర్ గుడ్ బై చెప్పాడు.GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ,మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి లేఖ ద్వారా తన రాజీనామా అందజేసారు.కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఆరోపణలు చేశారు.పార్టీ కోసం పనిచేసిన తనకు తగిన గుర్తింపు కొరవడిందని పార్టీలో అనుసరిస్తున్న విధానాలు నచ్చడం లేదని
పార్టీ అవిర్భావం నుంచి నేను కష్టపడి పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్న పార్టీ అభివృద్ధికి కృషి చేసాను . అలాంటి నాకు రాజకీయ భవిష్యత్ లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అధినాయకత్వం వారిపై కనీస చర్యలు తీసుకోక పోగా , వారికే మద్దతు ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించిందని బాబా ఫాసియుద్దీన్ లేఖలో పేర్కొన్నారు రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అధినాయకత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ప్రయోజనం కనపడలేదని గుండెల నుండా గులాబీ జెండాతో 22 ఏళ్లు పార్టీకోసం సిపాయిగా పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు చేసారు.అందుకే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి , మీడియా స్పోక్స్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బాబా ఫసియుద్దిన్ తన లేఖలో పేర్కోన్నారు.